26. ఏకశ్లోకీ మహాభారతం*

ఏకశ్లోకీ మహాభారతం

ఆదౌ పాణ్డవధార్తరాష్ట్రజనం
లాక్షాగృహే దాహనం
ద్యూతం శ్రీహరణం వనే విచరణం
మత్స్యాలయే వర్తనమ్ ।
లీలాగోగ్రహణం రణే విహరణం
సన్ధిక్రియా-జృమ్భణం
పశ్చాద్భీష్మ-సుయోధనాది-నిధనమ్
ఏతన్మహాభారతమ్ ॥

ekaślokī mahābhārata

ādau pāṇḍavadhārtarāṣṭrajananaṃ
lākṣāgṛhe dāhanaṃ
dyūtaṃ śrīharaṇaṃ vane vicaraṇaṃ
matsyālaye vartanam ।
līlāgograhaṇaṃ raṇe viharaṇaṃ
sandhikriyā-jṛmbhaṇaṃ
paścādbhīṣma-suyodhanādi-nidhanam
etanmahābhāratam ॥

*సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

ఆదౌ (ādau) = చాలా కాలం క్రితం
పాణ్డవ-ధార్తరాష్ట్ర-జననం (pāṇḍava-dhārtarāṣṭra-jananṃ) = పాండు ధృతరాష్ట్ర కుమారుల జననం
లాక్షాగృహే దాహనం (lākṣāgṛhe dāhanaṃ) = మైనపు రాజభవనం యొక్క దహనం
ద్యూతం (dyūtaṃ) = పాచికల ఆట
శ్రీహరణం (śrīharaṇaṃ) = సంపదను కోల్పోవడం
వనే విచరణం (vane vicaraṇaṃ) = అడవులు పట్టి తిరగడం
మత్స్యాలయే వర్తనమ్ (matsyālaye vartanam) = మత్స్య రాజ్యంలో ఉండడం
లీలా-గోగ్రహణం (līlā-gograhaṇaṃ) = కీచకుడిని చంపడం మరియు ఆవులను తీసుకెళ్లడం
రణే విహరణం (raṇe viharaṇaṃ) = యుద్ధంలో పై బట్టలను తీసుకుపోవడం
సన్ధిక్రియా-జృమ్భణం (sandhikriyā-jṛmbhaṇaṃ) = చర్చల కోసం విఫల ప్రయత్నం
పశ్చాత్ (pascāt) = ఆ పిమ్మట
భీష్మ-సుయోధనాది-నిధనమ్ (bhīṣma-suyodhanādi-nidhanam) = భీష్ముడు మరియు సుయోధనుల మరణం
ఏతత్ మహాభారతమ్ (etat mahābhāratam) = ఇదీ మహాభారతం

అర్ధం: చాలా కాలం క్రితం, పాండు ధృతరాష్ట్ర కుమారుల జననం; మైనపు రాజభవనం యొక్క దహనం; పాచికల ఆట; సంపదను కోల్పోవడం; అడవులు పట్టి తిరగడం; మత్స్య రాజ్యంలో ఉండడం; కీచకుడిని చంపడం మరియు ఆవులను తీసుకెళ్లడం; యుద్ధంలో పై బట్టలను తీసుకుపోవడం; చర్చల కోసం విఫల ప్రయత్నం; ఆ పిమ్మట భీష్ముడు మరియు సుయోధనుల మరణం; ఇదీ మహాభారతం.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: గీతా ప్రెస్ గోరఖ్ పూర్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం