Day-4 తెలుగు చలన చిత్రాల్లో రామాయణ కథలు

“హరికథలు చెప్పకు!”, ఎంత అవహేళన, హరికథలంటే మనకి?

చలన చిత్రాలు లేక మునుపు తెలుగు వారికే సొంతమైన కళలలో హరికథ చాలా ప్రధానమైనది. ఇది ఒక కళే కాదు, తెలుగు వారి సంప్రదాయం కూడా. ఇదే కాక, బుర్రకథలు, ఒగ్గు కథలు, తోలుబొమ్మలాటలు లాంటి ప్రాంతీయ కళలు కూడా ఉన్నాయి.

సంగీత, సాహిత్యాల మేలు కలయికే హరికథ. తెలుగులో ఈ సంప్రదాయం evolve అయ్యాక కొంచెం అభినయం, ఇంకొంచెం నాట్యం కూడా తోడు అయ్యాయి.

మా చిన్నప్పుడు శ్రీరామనవమి పందిళ్లలో, రేడియో లో, ఆ తరవాత దూరదర్శన్ లో అడపా తాడపా హరికథలు వినే అవకాశాలు నాకు కలిగాయి.

ఇప్పుడు మాత్రం సంక్రాంతి పండగకి గుర్తుగా పల్లెటూళ్ళో సంవత్సరానికి ఒక వారం రోజులు నెత్తిమీద గుమ్మడికాయ గిన్నె తో పాటలు పాడుకుంటూ, భిక్షాటన చేసేవాళ్ళు మాత్రమే హరిదాసు అనుకుంటారు. ఈ సంక్రాంతికి ఒక హరిదాసు TVS మీద boom box play చేస్తూ ఇంటింటా తిరుగుతుంటే WhatsApp లో చూశా. ఈ దుస్థితి కి మనమే బాధ్యులమేమో. ఆ కళకి takers లేక నే కదా, వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది!

అసలు హరికథ చెప్పే ఆయనను హరిదాసు, లేదా భాగవతులు అంటారు. నారదముని మనందరికీ తెలిసిన మొదటి హరిదాసు.

ఈ కళ కేవలం భాషా పండితులకే చెల్లింది.

మనం తెలుగు చలన చిత్రాల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి, తెలుగు చిత్రాల్లోమనందరికీ తెలిసిన రెండు హరికథా సన్నివేశాలు చెప్పుకుందాం. రెండే ఎందుకంటే, ఈ రెంటికీ ఒకే కధా వస్తువు, సీతా కల్యాణం.

శ్రీ నగజా తనయం
చిత్రం: వాగ్దానం (1961)
గానం: ఘంటసాల
సంగీతం: పెండ్యాల
సాహిత్యం: శ్రీ శ్రీ / కరుణశ్రీ ?

సీతా కల్యాణ సత్కధ ఘంటసాల మాస్టారు ఎంత జనరంజకంగా పాడారో, అంతే చక్కగా, రేలంగి గారు అభినయం చేశారు. All India Radio లో ఈ హరికథ ని ఎన్నిసార్లు విన్నమంటే, ఇందులో సంగతులు కూడా మనలో చాలామందికి by heart వచ్చేసే ఉంటాయి.

“గత నాలఫై రోజుల నుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పినట్లు చెప్పకుండా చెప్పుకుంటూ వస్తున్నా”రట. “పాలు, మిరియాలు”, భక్తులని మెలకువగా ఉంచడానికి “శ్రీమద్ రమా రమణ గోవిందా” ఉత్యాదులతో హాస్యరసం జోడించిన, హరికథా సాహిత్యానికి ఏమాత్రం అపహస్యం కాకుండా చక్కగా కాపాడారు. అది, హరికథ లో ఉన్న ప్రత్యేకత.

గొప్ప గొప్ప భాగవతులు సమకాలీన సమస్యలు (contemporary issues) కూడా సునాయాసంగా, సున్నితంగా కథతో జోదించగలిగే వాళ్ళట.

వయోలిన్ ఫ్రేమ్ లో కనిపించక పోయినా సూర్యకాంతం గారు ఎంత చక్కగా వాయించారు!

**

రామా కనవేమి రా
చిత్రం: స్వాతిముత్యం
సంగీతం: ఇళయరాజా
గానం: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం
Lyrics: ఆత్రేయ

సీతా కల్యాణ ఘట్టం ఇంత చక్కగా సినిమా కథతో జోడించడం ఒక్క కాశీనాథుని విశ్వనాథుని కే చెల్లింది.

“రామయ్య కన్నెత్తి చూడడేమయ్య”అనుకుంటున్నారట సీతమ్మ అనుంగు చెలకత్తెలు. సీతమ్మ వెతుక్కోవడం కాదు సుమా!

ఈ హరికథ లో కూడా సంగతులు అందరికీ వచ్చేసినవే.

హరికథ లో ఇంకో ప్రత్యేకం, audience ని interactive mode లోకి తీసుకు పోవడం. Beat speed alter చేస్తూ. ఆ ప్రక్రియ ఈ పాట లో నాకు నచ్చింది.

మీరు కూడా ఈ పాటలో లీనమవ్వడానికి ఇష్టపడతారని యూట్యూబ్ లింక్ క్రింద చూడండి.

శ్రీ నగజా తనయం (వాగ్దానం)
రామా కనవేమిరా (స్వాతిముత్యం)