30.1 రత్నాకరాద్ధౌతపదాం

రత్నాకరాద్ధౌతపదాం
హిమాలయకిరీటినీమ్ ।
బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం
వన్దే భారతమాతరమ్ ॥

ratnākarāddhautapadāṃ
himālayakirīṭinīm ।
brahmarājarṣiratnāḍhyāṃ
vande bhāratamātaram ॥

(అహమ్) భారతమాతరమ్ వన్దే ((aham) bhāratamātaram vande) = మాతృభూమి ( భారత్1) కు (నేను) సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను
రత్నాకర-అధౌతపదాం (ratnākara-adhautapadāṃ) = రత్నాల సృష్టికర్త అయిన సముద్రం ద్వారా ఎవరి పాదాలు కడగబడతాయో
హిమాలయ-కిరీటినీమ్ (himālaya-kirīṭinīm) = ఎవరి కిరీటం హిమాలయాలు అయిఉన్నదో
బ్రహ్మ-రాజర్షి-రత్న-అఢ్యాం (brahma-rājarṣi-ratna-aḍhyāṃ) = ఎవరయితే రత్నాల వంటి బ్రహ్మర్షులు / రాజర్షులు తో సంపన్నమై ఉన్నదో

1జ్ఞానం యొక్క కాంతి (భా)లో ఆనందించే (రమతే) భూమి – భారతదేశం.

అర్ధం: రత్నాల సృష్టికర్త అయిన సముద్రం ద్వారా ఎవరి పాదాలు కడగబడతాయో, ఎవరి కిరీటం హిమాలయాలు అయిఉన్నదో, ఎవరయితే రత్నాల వంటి బ్రహ్మర్షులు / రాజర్షులు తో సంపన్నమై ఉన్నదో ఆ మాతృభూమి ( భారత్1) కు (నేను) సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: @MumukshuSavitri on X (Twitter)
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం