38. కర్తా కారయితా

కర్తా కారయితా చైవ
ప్రేరకశ్చానుమోదకః ।
సుకృతే దుష్కృతే చైవ
చత్వారః సమభాగినః ॥

kartā kārayitā caiva
prerakaścānumodakaḥ

sukṛte duṣkṛte caiva
catvāraḥ samabhāginaḥ

సుకృతే దుష్కృతే చ ఏవ (sukṛte duṣkṛte ca eva) = ఏ కార్యం లోనైనా (మంచి లేదా చెడు)
చత్వారః సమభాగినః (catvāraḥ samabhāginaḥ) = ఈ నలుగురూ సమాన భాగస్వాములు
కర్తా (kartā) = చేసేవాడు
కారయితా (kārayitā) = చేసేవాడు
చ ఏవ (ca eva) = మరియు
ప్రేరకః (prerakaḥ) = ప్రేరేపించేవాడు / ప్రోత్సహించేవాడు
చ (ca) = మరియు
అనుమోదకః (anumodakaḥ) = అనుమతించేవాడు / చేయనిచ్చేవాడు

అర్ధం: మంచి కార్యం లోనైనా లేదా చెడు కార్యం లోనైనా, ఈ నలుగురూ సమాన భాగస్వాములు; చేసేవాడు, చేయించేవాడు, ప్రేరేపించేవాడు (ప్రోత్సహించేవాడు), చేయనిచ్చేవాడు (అనుమతించేవాడు).

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం