40. క్షణశః కణశశ్చైవ

క్షణశః కణశశ్చైవ
విద్యామర్థం చ సాధయేత్ ।
క్షణత్యాగే కుతో విద్యా,
కణత్యాగే కుతో ధనమ్ ॥

kṣaṇaśaḥ kaṇaśaścaiva
vidyāmarthaṃ ca sādhayet

kṣaṇatyāge kuto vidyā,
kaṇatyāge kuto dhanam

క్షణశః విద్యాం సాధయేత్ (kṣaṇaśaḥ vidyāṃ sādhayet) = క్షణక్షణం కృషి చేస్తేనే జ్ఞానం వృద్ధి అవుతుంది
చ ఏవ (ca eva) = మరియు
కణశః అర్థం సాధయేత్ (kaṇaśaḥ arthaṃ sādhayet) = ప్రతీ గింజా కూడబెడితేనే ధాన్యం (ధనం) సమకూరుతుంది
క్షణత్యాగే త్యాగే విద్యా కుతం (ṣaṇatyāge vidyā kutaṃ) = క్షణం వృధా చేయడంలో జ్ఞానం ఎక్కడుంది?
కణత్యాగే ధనం కుతం (kaṇatyāge dhanaṃ kutaṃ) = ధాన్యపు గింజలను వృధా చేస్తే సంపద ఎక్కడ సమకూరుతుంది?

అర్ధం: క్షణం క్షణం జ్ఞాన సముపార్జనకై కృషి చేయ్యలి. అలగే ప్రతీ గింజా కూడబెడితేనే ధాన్యం (ధనం) సమకూరుతుంది. క్షణం వృధా చేయడంలో జ్ఞానం ఎక్కడుంది? ధాన్యపు గింజలను వృధా చేస్తే సంపద ఎక్కడ సమకూరుతుంది?

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం