45. నృత్తావసానే నటరాజరాజః

నృత్తావసానే నటరాజరాజో
ననాద ఢక్కాం నవపఞ్చవారమ్ ।
ఉద్ధర్తుకామః సనకాదిసిద్ధాన్
ఏతద్విమర్షే శివసూత్రజాలమ్ ॥

nṛttāvasāne naṭarājarājo
nanāda ḍhakkāṃ navapañcavāram

uddhartukāmaḥ sanakādisiddhān
etadvimarṣe śivasūtrajālam

నృత్తావసానే (nṛttāvasāne) = (తన) నృత్యం చివరిలో
నటరాజరాజః (naṭarājarājaḥ) = కళలకు రారాజు అయిన నటరాజు
ఢక్కాం ననాద (ḍhakkāṃ nanāda) = డమరుకం మ్రోగించాడు
నవపఞ్చవారమ్ (navapañcavāram) = పధ్నాలుగు సార్లు
సనకాదిసిద్ధాన్ ఉద్ధర్తుకామః (sanakādisiddhān uddhartukāmaḥ) = సనకాది సిద్ధ పురుషులను ఉద్ధరించడానికా అన్నట్టు
ఏతత్ శివసూత్రజాలమ్ విమర్షే (etat śivasūtrajālam vimarṣe) = అలా శివసూత్రం అనే వల ఆవిర్భవించింది.

అర్థం: తన నృత్యం ముగింపులో, కళలకు రారాజు అయిన నటరాజు (శివుడు) పద్నాలుగు సార్లు డమరుకం వాయించాడు / మ్రోగించాడు. అలా, “శివసూత్రం” అని పిలువబడే ఈ వలయం సనకుడు మొదలైన సిద్ధ పురుషులన కోరికలను నెరవేర్చడానికా (ఉద్ధరించడానికా) అన్నట్టు ఆవిర్భవించింది. ఈ పద్నాలుగు సూత్రాలు తరువాత “మహేశ్వరసూత్రణి” గా గొప్ప వ్యాకరణకర్త పాణినిచే అభివృద్ధి చేయబడ్డాయి.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం