54. ఏకేనాపి సువృక్షేణ

ఏకేనాపి సువృక్షేణ
పుష్పితేన సుగన్ధినా ।
వాసితం తద్వనం సర్వం
సుపుత్రేణ కులం యథా ॥

ekenāpi suvṛkṣeṇa
puṣpitena sugandhinā

vāsitaṃ tadvanaṃ sarvaṃ
suputreṇa kulaṃ yathā

ఏకేన అపి సువృక్షేణ (ekena api suvṛkṣeṇa) = ఒక్క మంచి చెట్టు కూడా
సుగన్ధినా పుష్పితేన (sugandhinā puṣpitena) = సువాసనగల పూలతో
తత్సర్వం వనం వాసితం (tatsarvaṃ vanaṃ vāsitaṃ) = అడవి మొత్తాన్ని సువాసనగా మారుస్తుంది
యథా (yathā) = ఎలాగైతే
సుపుత్రేణ కులం (suputreṇa kulaṃ) = ఒక గొప్ప బిడ్డ మొత్తం వంశానికి (కీర్తి తెస్తుంది)

అర్ధం: సువాసనగల పూలతో ఒక్క మంచి చెట్టు కూడా అడవి మొత్తాన్ని సువాసనగా మార్చినట్లు, ఒక గొప్ప బిడ్డ మొత్తం వంశానికి కీర్తి తెస్తుంది. ఉదాహరణ: ప్రహ్లాదుడు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం