58. కర్పూరగౌరం కరుణావతారం

కర్పూరగౌరం కరుణావతారం
సంసారసారం భుజగేన్ద్రహారమ్ ।
సదా వసన్తం హృదయారవిన్దే
భవం భవానీసహితం నమామి ॥

karpūragauraṃ karuṇāvatāraṃ
saṃsārasāraṃ bhujagendrahāram

sadā vasantaṃ hṛdayāravinde
bhavaṃ bhavānīsahitaṃ namāmi

కర్పూరగౌరం (karpūragauraṃ) = కర్పూరం వంటి రంగు కలిగినవానికి
కరుణా-అవతారమ్ (karuṇā-avatāram) = కరుణ యొక్క అవతారానికి
సంసారసారమ్ (saṃsārasāram) = సంసారము (ప్రపంచము) యొక్క సారము వంటి వానికి
భుజగేన్ద్ర-హారమ్ (bhujagendra-hāram) = సర్పరాజునే మాలగా ధరించిన వానికి
సదా హృదయ-అరవిన్దే వసన్తం (sadā hṛdaya-aravinde vasantaṃ) = కమలము వంటి హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉన్నవానికి;
భవమ్ (bhavam) = ఉన్నది అన్న ప్రతిదానికి కారణమైనవానికి;
భవానీసహితమ్ (bhavānīsahitam) = పార్వతీమాత తో కలిసియున్న వానికి
నమామి (namāmi) = నమామి / నమస్సులు.

అర్ధం: కర్పూరం వంటి రంగు కలిగినవానికి; కరుణ యొక్క అవతారానికి; సంసారము (ప్రపంచము) యొక్క సారము వంటి వానికి; సర్పరాజునే మాలగా ధరించిన వానికి; కమలము వంటి హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉన్నవానికి; ఉన్నది అన్న ప్రతిదానికి కారణమైనవానికి; పార్వతీమాత తో కలిసియున్న వానికి నమామి / నమస్సులు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం