60. ఛాయామన్యస్య కుర్వన్తి

ఛాయామన్యస్య కుర్వన్తి
తిష్ఠాన్తి స్వయమాతపే ॥
ఫలన్త్యపి పరార్థాయ
వృక్షాః సత్పురుషా ఇవ ॥

chāyāmanyasya kurvanti
tiṣṭhānti svayamātape

phalantyapi parārthāya
vṛkṣāḥ satpuruṣā iva

వృక్షాః (vṛkṣāḥ) = చెట్లు
అన్యస్య ఛాయాం కుర్వన్తి (anyasya chāyāṃ kurvanti) = ఇతరులకు నీడను ఇస్తాయి
స్వయమ్ ఆతపే తిష్ఠాన్తి (svayam ātape tiṣṭhānti) = సూర్యుని వేడిలో ఉంటూ కూడా
పరార్థాయ ఫలన్తి అపి (parārthāya phalanti api) = మరియు ఇతరులకు పండ్లను కూడా ఇస్తాయి
సత్పురుషా ఇవ (satpuruṣā iva) = గొప్ప వ్యక్తుల వలె.

అర్ధం: చెట్లు, గొప్ప వ్యక్తుల వలె, సూర్యుని వేడిలో ఉంటూ కూడా ఇతరులకు నీడను ఇస్తాయి. మరియు ఇతరులకు పండ్లను కూడా ఇస్తాయి (మనము వాటిపై రాళ్ళు విసిరినప్పటికీ).

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం