68. దానేన పాణిర్న తు కఙ్కణేన

దానేన పాణిర్న తు కఙ్కణేన
స్నానేన సుద్ధిర్న తు చన్దనేన ।
మానేన తృప్తిర్న తు భోజనేన
జ్ఞానేన ముక్తిర్న తు పూజనేన ॥

dānena pāṇirna tu kaṅkaṇena
snānena suddhirna tu candanena

mānena tṛptirna tu bhojanena
jñānena muktirna tu pūjanena

దానేన పాణిః కఙ్కణేన తు న (dānena pāṇiḥ kaṅkaṇena tu na) = చేయి (అందంగా మారుతుంది) దాతృత్వం ద్వారా కానీ కంకణాల ద్వారా కాదు
స్నానేన సుద్ధిః చన్దనేన తు న (snānena suddhiḥ candanena tu na) = స్వచ్ఛత (స్నానం ద్వారా లభిస్తుంది) కానీ చందనం యొక్క మాల ధరించడం / పూయడం ద్వారా కాదు
మానేన తృప్తిః భోజనేన తు న (mānena tṛptiḥ bhojanena tu na) = (నిజమైన) సంతృప్తి (వస్తుంది) గౌరవం ద్వారా కానీ ఆహారం / తినడం ద్వారా కాదు
జ్ఞానేన ముక్తిః పూజనేన తు న (jñānena muktiḥ pūjanena tu na) = (ముక్తి) సాక్షాత్కారం (కలుగుగుతుంది) జ్ఞానం ద్వారా కానీ ఆరాధన / కీర్తి ద్వారా కాదు.

అర్ధం: చేయి (అందంగా మారుతుంది) దాతృత్వం ద్వారా కానీ కంకణాల ద్వారా కాదు. స్వచ్ఛత (స్నానం ద్వారా లభిస్తుంది) కానీ చందనం (యొక్క మాల ధరించడం / పూయడం) ద్వారా కాదు. (నిజమైన) సంతృప్తి (వస్తుంది) గౌరవం ద్వారా కానీ ఆహారం / తినడం ద్వారా కాదు. (ముక్తి) సాక్షాత్కారం (కలుగుగుతుంది) జ్ఞానం ద్వారా కానీ ఆరాధన / కీర్తి ద్వారా కాదు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం