72. నిత్యం క్రోధాత్తపో రక్షేత్

నిత్యం క్రోధాత్తపో రక్షేత్
ధర్మం రక్షేచ్చ మత్సరాత్ ।
విద్యాం మానాపమానాభ్యామ్
ఆత్మానం తు ప్రమాదత్ః ॥

nityaṃ krodhāttapo rakṣet
dharmaṃ rakṣecca matsarāt ।
vidyāṃ mānāpamānābhyām
ātmānaṃ tu pramādatḥ ॥

నిత్యమ్ (nityam) = ఎల్లప్పుడూ
తపః క్రోధాత్ రక్షేత్ (tapaḥ krodhāt rakṣet) = కోపం నుండి తపస్సును రక్షించు
ధర్మం చ మత్సరాత్ రక్షేత్ (dharmaṃ ca matsarāt rakṣet) = మరియు అసూయ నుండి మంచితనాన్ని (రక్షించు)
విద్యాం మనాపమానాభ్యాం (రక్షేత్) (vidyāṃ manāpamānābhyāṃ (rakṣet)) = గౌరవం మరియు అగౌరవం నుండి జ్ఞానం (రక్షించు)
ఆత్మానం తు ప్రమాదతః (రక్షేత్) (ātmānaṃ tu pramādataḥ (rakṣet)) = అజాగ్రత్త / సోమరితనం నుండి తనను తాను (ఎల్లప్పుడూ) రక్షించుకోవాలి.

అర్ధం: ఎల్లప్పుడూ కోపం నుండి తపస్సును రక్షించు; మరియు అసూయ నుండి మంచితనాన్ని (రక్షించు); గౌరవం మరియు అగౌరవం నుండి జ్ఞానం (రక్షించు). అజాగ్రత్త / సోమరితనం నుండి తనను తాను (ఎల్లప్పుడూ) రక్షించుకోవాలి.

ఈ సుభాషితం ద్వారా రచయిత తపస్సు; ధర్మం (మంచితనం); జ్ఞానం మొదలైన సద్గుణాల యొక్క దోషాల గురించి హెచ్చరించాడు. అందువలన తనను తాను నిరంతరం ఈ దోషాల నుంచి రక్షించుకుంటూ ఉండాలి.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం