
యేన శుక్లీకృతా హంసాః
శుకాశ్చ హరితీకృతాః ।
మయూరాశ్చిత్రితా యేన
స తే వృత్తిం విధాస్యతి ॥
yena śuklīkṛtā haṃsāḥ
śukāśca haritīkṛtāḥ ।
mayūrāścitritā yena
sa te vṛttiṃ vidhāsyati ॥
యేన హంసాః శుక్లీకృతా (yena haṃsāḥ śuklīkṛtā) = ఎవరైతే హంసలను తెల్లగా తయారు చేసారో
శుకాః చ హరితీకృతాః (śukāḥ ca haritīkṛtāḥ ) = ఎవరు చిలకలను పచ్చగా చేసారో
మయూరాః చిత్రితాః యేన (mayūrāḥ citritāḥ yena) = ఎవరు నేమలికి రంగులు వేసారో
సః తే వృత్తిం విధాస్యతి (saḥ te vṛttiṃ vidhāsyati) = అతడే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు.
అర్ధం: ఎవరైతే హంసలను తెల్లగా తయారు చేసారో; ఎవరు చిలకలను పచ్చగా చేసారో; ఎవరు నేమలికి రంగులు వేసారో; అతడే నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు.
సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం