67. కృతజ్ఞత

కృతజ్ఞతా యా చ హృది స్థితా మే,
వక్తుం న శక్యా ఖలు యత్నతోఽపి ।
గురో ప్రసీద కృపయా విధేహి,
త్వత్పాదభక్తిం పరమానురక్తిమ్ ॥
— పూజ్య గురుజీ స్వామీ తేజోమయానన్ద జీ

kṛtajñatā yā ca hṛdi sthitā me,
vaktuṃ na śakyā khalu yatnato’pi ।
guro prasīda kṛpayā vidhehi,
tvatpādabhaktiṃ paramānuraktim ॥
— pūjya gurujī svāmī tejomayānanda jī

యా కృతజ్ఞతా మే హృది స్థితా (yā kṛtajñatā me hṛdi sthitā) = నా హృదయాన్ని నింపే కృతజ్ఞత
యత్నతః అపి (yatnataḥ api) = ఎంత ప్రయత్నించినా
ఖలు (khalu) = వాస్తవంగా
వక్తుం న శక్యా (vaktuṃ na śakyā) = చెప్పడం (వ్యక్తం చేయడం) సాధ్యం కావడం లేదు
గురో ప్రసీద (guro prasīda) = ఓ గురూ!
కృపయా విధేహి (kṛpayā vidhehi) = దయచేసి నాకు ప్రసాదించండి
త్వత్పాదభక్తిం (tvatpādabhaktiṃ) = మీ పాదల (పాద కమలాల) పై భక్తి
పరమానురక్తిమ్ (paramānuraktim) = అత్యున్నత ప్రేమ (పరమాత్మ పట్ల ప్రేమ).

అర్ధం: వాస్తవంగా నా హృదయాన్ని నింపే కృతజ్ఞత ఎంత ప్రయత్నించినా చెప్పడం (వ్యక్తం చేయడం) సాధ్యం కావడం లేదు. మీ పాదల (పాద కమలాల) పై భక్తి, అత్యున్నత ప్రేమ (పరమాత్మ పట్ల ప్రేమ) ఓ గురూ దయచేసి నాకు ప్రసాదించండి.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం