64. త్యజ దుర్జనసంసర్గం

త్యజ దుర్జనసంసర్గం
భజ సాధుసమాగమమ్ ।
కురు పుణ్యమహోరాత్రం
స్మర సర్వేశ్వరం సదా ॥

tyaja durjanasaṃsargaṃ
bhaja sādhusamāgamam

kuru puṇyamahorātraṃ
smara sarveśvaraṃ sadā

దుర్జనసంసర్గం త్యజ (durjanasaṃsargaṃ tyaja) = చెడ్డవారి సహవాసాన్ని విడిచిపెట్టు
సాధుసమాగమం భజ (sādhusamāgamaṃ bhaja) = గొప్పవారి సహవాసాన్ని కోరుకుకో
పుణ్యమహోరాత్రం కురు (puṇyamahorātraṃ kuru) = అహర్నిశలూ (పగలు-రాత్రి) మంచి పనులు చేయి
సర్వేశ్వరం సదా స్మర (sarveśvaraṃ sadā smara) = ఎల్లప్పుడు సర్వేశ్వరుని స్మరించుము.

అర్ధం: చెడ్డవారి సహవాసాన్ని విడిచిపెట్టు; గొప్పవారి సహవాసాన్ని కోరుకుకో; అహర్నిశలూ (పగలు-రాత్రి) మంచి పనులు చేయి; ఎల్లప్పుడు సర్వేశ్వరుని స్మరించుము.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం