73. నిన్దన్తు నీతినిపుణా

నిన్దన్తు నీతినిపుణా యది వా స్తువన్తు
లక్ష్మీః సమావిశతు గచ్ఛతు వా యథేష్టమ్ ।
అద్వైవ వా మరణమస్తు యుగాన్తరే వా
న్యాయాత్పథః ప్రవిచలన్తి పదం న ధీరాః ॥

nindantu nītinipuṇā yadi vā stuvantu
lakṣmīḥ samāviśatu gacchatu vā yatheṣṭam ।
advaiva vā maraṇamastu yugāntare vā
nyāyātpathaḥ pravicalanti padaṃ na dhīrāḥ ॥

నీతినిపుణాః (nītinipuṇāḥ) = వ్యూహాలలో నిష్ణాతులైన వారు (నిపుణులు అనుకునేవారు)
నిన్దన్తు (nindantu) = విమర్శించవచ్చు
యది వా స్తువన్తు (yadi vā stuvantu) = లేదా ప్రశంసించవచ్చు
లక్ష్మీః సమావిశతు (lakṣmīḥ samāviśatu) = లక్ష్మీ (సంపద) ప్రాప్తించవచ్చు
వా గచ్ఛతు (vā gacchatu) = లేదా పోవచ్చు
యథేష్టమ్ (yatheṣṭam) = (దాని) ఇష్టానుసారం
మరణమ్ అద్వ ఏవ అస్తు (maraṇam adva eva astu) = మరణం ఈరోజే రావచ్చు
వా యుగాన్తరే (vā yugāntare) = లేదా చాలా కాలం తర్వాత
ధీరాః (dhīrāḥ) = గొప్ప వ్యక్తులు
న్యాయాత్ పథః (nyāyāt pathaḥ) = న్యాయ మార్గం నుండి
పదం న ప్రవిచలన్తి (padaṃ na pravicalanti) = వారి పాదాలను మరలించరు

అర్ధం: వ్యూహాలలో నిష్ణాతులైన వారు (నిపుణులు అనుకునేవారు) విమర్శించవచ్చు లేదా ప్రశంసించవచ్చు. లక్ష్మీ (సంపద) ప్రాప్తించవచ్చు లేదా పోవచ్చు (దాని) ఇష్టానుసారం. మరణం ఈరోజే రావచ్చు లేదా చాలా కాలం తర్వాత (రావచ్చు). గొప్ప వ్యక్తులు (మాత్రం) న్యాయ మార్గం నుండి వారి పాదాలను మరలించరు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: అరుణ్ యోగిరాజ్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం