
క్షణం ప్రతిక్షణం యన్నవం నవం,
తచ్చ సున్దరం సచ్చ తచ్ఛివమ్ ।
వర్ష నూతనం తే శుభం ముదం,
ఉత్తరోత్తరం భవతు సిద్ధిదమ్ ॥
kṣaṇaṃ pratikṣaṇaṃ yannavaṃ navaṃ,
tacca sundaraṃ sacca tacchivam ।
varṣa nūtanaṃ te śubhaṃ mudaṃ,
uttarottaraṃ bhavatu siddhidam ॥
క్షణం ప్రతిక్షణమ్ (kṣaṇaṃ pratikṣaṇam) = ప్రతిక్షణము
యత్ నవం నవమ్ (yat navaṃ navam) = కొత్తగా ఉన్నది
తత్ చ సున్దరమ్ (tat ca sundaram) = అది ఒక్కటే అందంగా ఉంటుంది
సత్ చ తత్ శివమ్ (sat ca tat śivam) = అది మాత్రమే నిజమైనది మరియు మంగళకరమైనది
నూతనం వర్ష (nūtanaṃ varṣa) = నూతన (కొత్త) సంవత్సరం
తే భవతు (te bhavatu) = మీకు అగు గాక
శుభమ్ (śubham) = దివ్యప్రదము
ముదమ్ (mudam) = సంతోషకరము
ఉత్తరోత్తరం సిద్ధిదమ్ (uttarottaraṃ siddhidam) = మరింత విజయాన్ని ఇచ్చేది
అర్ధం: ప్రతిక్షణము కొత్తగా, అందంగా ఉన్నది; అది మాత్రమే నిజమైనది మరియు మంగళకరమైనది. నూతన (కొత్త) సంవత్సరం మీకు దివ్యప్రదము, సంతోషకరము మరియు మరింత విజయాన్ని ఇచ్చేది అగు గాక!
సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం