33. సచ్చిదానన్దరూపాయ

సచ్చిదానన్దరూపాయ
విశ్వోత్పత్త్యాది-హేతవే ।
తాపత్రయ-వినాశాయ
శ్రీకృష్ణాయ వయం నుమః ॥

saccidānandrūpāya
viśvotpattyādi-hetave ।
tāpatraya-vināśāya
śrīkṛṣṇāya vayaṃ numaḥ ॥

వయం శ్రీకృష్ణాయ నుమః (vayaṃ śrīkṛṣṇāya numaḥ) = శ్రీకృష్ణునికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాము
సచ్చిదానన్దరూపాయ (saccidānandarūpāya) = అస్తిత్వం-చైతన్యం-ఆనందం (అనంతం) అనే స్వభావం ఉన్నవాడికి
విశ్వ-ఉత్పత్తి-ఆది-హేతవే (viśva-utpatti-ādi-hetave) = ప్రపంచ సృష్టి, మొదలైన వాటికి కారణమైన వాడికి
తాపత్రయ-వినాశాయ (tāpatraya-vināśāya) = మూడు బాధలను నాశనం చేసేవాడికి (ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక)

అర్ధం: అస్తిత్వం-చైతన్యం-ఆనంద స్వరూపుడు, ప్రపంచ సృష్టి మొదలైనవాటికి కారణమైనవాడు మరియు ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక (మూడు) బాధలను నాశనం చేసేవాడు అయిన శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేస్తున్నాము.

గమనిక: పై నాలుగు స్థాయిలకు అదనంగా ఇంద్ర, అగ్ని, వాయు మొదలైన వారిని దేవతలు గా గుర్తించాలి.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం