25. ఏకశ్లోకీ-రామాయణం*

ఏకశ్లోకీ-రామాయణం

పూర్వం రామతపోవనాది-గమనం
హత్వా మృగం కాఞ్చనం
వైదేహీహరణం జటాయుమరణం
సుగ్రీవసమ్భాషణం ।
వాలీనిగ్రహణం సముద్రతరణం
లఙ్కాపురీమర్దనం
పశ్చాద్రావణ-కుమ్భకర్ణ-హననమ్
ఏతధ్ది రామాయణమ్ ॥

ekaślokī-rāmāyaṇa

pūrvaṃ rāmatapovanādi-gamanaṃ
hatvā mṛgaṃ kāñcanaṃ
vaidehīharaṇaṃ jaṭāyumaraṇaṃ
sugrīvasambhāṣaṇaṃ ।
vālīnigrahaṇaṃ samudrataraṇaṃ
laṅkāpurīmardanaṃ
paścādrāvaṇa-kumbhakarṇa-hananam
etadhdi rāmāyaṇam ॥

*సూచన: ఆకాశవాణి (All India Radio) సంస్కృతపాఠం కార్యక్రమం సిగ్నేచర్ ట్యూన్ (కేయూరాణి న భూషయన్తి పురుషం) తెలిస్తే ఈ శ్లోకం నేర్చుకోవడం సులువు. ఇక్కడ చూడండి.

పూర్వమ్ (pūrvam) = చాలా కాలం క్రితం
రామతపోవనాది-గమనం (rāmatapovanādi-gamanaṃ) = శ్రీరాముడు (తపస్సు కొరకు) అరణ్యానికి వెళ్ళడం
కాఞ్చనం మృగం హత్వా (kāñcanaṃ mṛgaṃ hatvā) = బంగారు జింకను చంపడం
వైదేహీ-హరణం (vaidehī-haraṇaṃ) = (రావణుడు) సీతను అపహరణం చెయ్యడం
జటాయు-మరణం (jaṭāyu-maraṇaṃ) = జటాయు (రాబందు) మరణం
సుగ్రీవ-సమ్భాషణం (sugrīva-sambhāṣaṇaṃ) = సుగ్రీవునితో సంభాషణ
వాలీ-నిగ్రహణం (vālī-nigrahaṇaṃ) = వాలిని చంపడం
సముద్ర-తరణం (samudra-taraṇaṃ) = సముద్రాన్ని దాటడం
లఙ్కాపురీ-మర్దనం (laṅkāpurī-mardanaṃ) = లంకా నగరం నాశనం
పశ్చాత్ (pashchaat) = ఆ పిమ్మట
రావణ-కుమ్భకర్ణ-హననమ్ (rāvaṇa-kumbhakarṇa-hananam) = రావణుడు మరియు కుంభకర్ణుడిని చంపడం
ఏతత్ హి రామాయణమ్ (etat hi rāmāyaṇam) = నిజంగా ఇదీ రామాయణం.

అర్ధం: చాలా కాలం క్రితం, శ్రీరాముడు (తపస్సు కొరకు) అరణ్యానికి వెళ్ళడం; బంగారు జింకను చంపడం; (రావణుడు) సీతను అపహరణం చెయ్యడం; జటాయు (రాబందు) మరణం; సుగ్రీవునితో సంభాషణ; వాలిని చంపడం; సముద్రాన్ని దాటడం; లంకా నగరం నాశనం; ఆ పిమ్మట రావణుడు మరియు కుంభకర్ణుడిని చంపడం; నిజంగా ఇదీ రామాయణం.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం