69. పెళ్లిరోజు శుభాకాంక్షలు

వివాహదినమిదం భవతు హర్షదమ్ ।
మఙ్గలం తథా వాం చ క్షేమదమ్ ॥
ప్రతిదినం నవం ప్రేమ వర్ధతామ్ ।
శతగుణం కులం సదా హి మోదనామ్ ॥
లోకసేవయా దేవపూజనమ్ ।
గృహస్థజీవనం భవతు మోక్షదమ్ ॥

. . . . . పూజ్య గురుజి స్వామీ తేజోమయానన్ద జీ

vivāhadinamidaṃ bhavatu harṣadam ।
maṅgalaṃ tathā vāṃ ca kṣemadam ॥
pratidinaṃ navaṃ prema vardhatām ।
śataguṇaṃ kulaṃ sadā hi modanām ॥
lokasevayā devapūjanam ।
gṛhasthajīvanaṃ bhavatu mokṣadam ॥

. . . . . pūjya guruji svāmī tejomayānanda jī

ఇదం వివాహదినమ్ (idaṃ vivāhadinam) = ఈ వివాహ వార్షికోత్సవంరోజు
వామ్ (vām) = మీ ఇద్దరికీ
హర్షదమ్ (harṣadam) = ఆనందాన్ని ఇచ్చేవాడు
మఙ్గలమ్ (maṅgalam) = శుభప్రదమైనది
తథా (tathā) = మరియు కూడా
క్షేమదమ్ (kṣemadam) = శ్రేయస్సు ఇచ్చేవాడు
భవతు (bhavatu) = అగు గాక
ప్రతిదినం నవం ప్రేమ వర్ధనమ్ (pratidinaṃ navaṃ prema vardhanam) = మీ ప్రేమ కొత్తదిగా మరియు దినదినాభివృద్ధి చెందుగాక
శతగుణం కులం సదా మోదతాం హి (śataguṇaṃ kulaṃ sadā modatāṃ hi) = మీ కుటుంబం వృద్ధి చెందుగాక మరియు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుగాక
లోకసేవయా దేవపూజనమ్ (lokasevayā devapūjanam) = ప్రజల సేవ ద్వారా భగవంతుని ఆరాధించడం
గృహస్థజీవనం మోక్షదం భవతు (gṛhasthajīvanaṃ mokṣadaṃ bhavatu) = గృహస్థుని జీవితం మీకు ముక్తిని ప్రసాదించుగాక

అర్ధం: మీ ఈ వార్షికోత్సవం (ఇద్దరికీ) సంతోషకరమైనది, శుభప్రదమైనది మరియు సంపన్నమైనది అగుగాక. మీ ప్రేమ ప్రతి రోజు కొత్తదిగా మరియు దినదినాభివృద్ధి చెందుగాక. మీ కుటుంబం వృద్ధి చెందుతూ మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుగాక. ప్రజల సేవ ద్వారా భగవంతుని ఆరాధనతో నిండిన మీ గృహస్థాశ్రమ జీవితం మీకు ముక్తిని ప్రసాదించుగాక.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: బాపు
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం