న చోరహార్యం న చ రాజహార్యం
న భ్రాతృభాజ్యం న చ భారకారి ।
వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం
విద్యాధనం సర్వధనప్రధానమ్ ॥
na corahāryaṃ na ca rājahāryaṃ
na bhrātṛbhājyaṃ na ca bhārakāri ।
vyaye kṛte vardhata eva nityaṃ
vidyādhanaṃ sarvadhanapradhānam ॥
చోరహార్యం న (corahāryaṃ na) = దొంగలు దొంగిలించలేనిది
రాజహార్యం చ న (rājahāryaṃ ca na ) = మరియు రాజు తీసుకొనిపోలేనిది
భ్రాతృభాజ్యం న (bhrātṛbhājyaṃ na) = సోదరుల మధ్య విభజించబడలేనిది
భారకారి చ న (bhārakāri ca na) = మరియు ఎలాంటి భారాన్ని సృష్టించనిది
వ్యయే కృతే (vyaye kṛte) = ఖర్చు చేసినప్పుడు
నిత్యం వర్ధత ఏవ (nityaṃ vardhata eva) = ఎల్లప్పుడూ వృద్ధిచెందేది
విద్యాధనం సర్వధనప్రధానమ్ (vidyādhanaṃ sarvadhanapradhānam) = అన్ని రకాల సంపదలలో జ్ఞాన సంపద గొప్పది.
అర్ధం: దొంగలు దొంగిలించలేనిది; మరియు రాజు తీసుకొనిపోలేనిది; సోదరుల మధ్య విభజించబడలేనిది; మరియు ఎలాంటి భారాన్ని సృష్టించనిది; ఖర్చు చేసినప్పుడు ఎల్లప్పుడూ వృద్ధిచెందేది; అన్ని రకాల సంపదలలో జ్ఞాన సంపద గొప్పది.
సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం